Intermediate: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. విద్యార్థుల వివరాలు ఇలా..

ఏటూరు నాగారం: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులకు రేపటి నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకొచ్చేందుకు అనుమతి లేదు. ఇప్పటికే విద్యార్థులు హాల్‌ టికెట్లు తీసుకుని పరీక్ష కేంద్రాలకు సమీపంలో గల గ్రామాల్లోని అద్దెకు గదులు తీసుకొని ఉంటున్నారు. దీనివల్ల వారికి వచ్చి పోయే దూరభారం తగ్గుతుందని చెబుతున్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

మార్చి 19వరకు..

విద్యార్థుల కోసం తాగునీటి సౌకర్యం, వైద్యం, విద్యుత్‌ సరఫరా, సరైన డ్యూయల్‌ డెస్క్‌లు, బేంచీలను ఆయా పరీక్ష కేంద్రాల కళాశాల యాజమాన్యాలు సిద్ధం చేశాయి. రేపు(28న) సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1 ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 29న సెకండ్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. అప్పటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

3,973 మంది విద్యార్థులు

జిల్లాలో 3,973 మంది ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు 10 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ములుగు జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల, జాకారంలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌, బండారుపల్లిలో మోడల్‌ స్కూల్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారంలోని జూనియర్‌ కళాశాలలతో పాటు ఏటూరునాగారంలోని గిరిజన బాలికల గురుకుల జూనియర్‌ కళాశాల, మంగపేట జూనియర్‌ కళాశాల, వాజేడు జూనియర్‌ కళాశాల, వెంకటాపురం(కె) జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు పరీక్షలను రాయాల్సి ఉంది.

 

జనరల్‌

ఒకేషనల్‌

మొత్తం

మొదటి సంవత్సరం

 1,717

287

2,004

రెండో సంవత్సరం

1,696

273

1,969

మొత్తం

3,413

560

3,973

జిల్లాలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వివరాలు

  • హాజరుకానున్న 3,973 మంది విద్యార్థులు
  • జిల్లాలో 10పరీక్ష కేంద్రాల ఏర్పాటు


పకడ్బందీగా ఏర్పాట్లు
ఇంటర్‌ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేశాం. పరీక్ష పత్రాలు ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్ల ద్వారా కళాశాలలకు బందోబస్తు మధ్య వస్తాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు కూడా ఉండరాదు. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 9గంటల తర్వాత ఎవరిని అనుమతించేది లేదు.
– వెంకటేశ్వర్లు, ఇంటర్‌ నోడల్‌ అధికారి

#Tags