Clinical training: క్లినికల్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌లో ఎంఎల్‌టీ కోర్సు 2019 మార్చి తర్వాత ఉత్తీర్ణులైన వారు ఏడాది పాటు క్లినికల్‌ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు.

జిల్లాలోని ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికై న వారు రూ.వెయ్యి డీడీ చెల్లించాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

చదవండి: Teddy Bear Clinic: పిల్లల్లో భయం పోగొట్టే క్లినిక్‌లు ఇప్పుడు స్కూళ్లలో..

బయోడేటా ఫారం, సర్టిఫికెట్ల జిరాక్స్‌తో పాటు రూ.10 పోస్టల్‌ స్టాంప్‌ అతికించిన సొంత చిరునామా గల కవర్‌ను ఫిబ్ర‌వ‌రి 26 సాయంత్రం ఐదు గంటల్లోగా తమ కార్యాలయంలో అందజేయాలని డీఐఈఓ సూచించారు.

#Tags