Anugnya Scored 993/1000 Marks in TS Inter : టీఎస్ ఇంటర్‌లో 993/1000 మార్కులు.. సెకండియర్ టాపర్ ఈమె.. ఎలా అంటే..?
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 64.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 2 శాతం తగ్గింది. తెలంగాణలో మొత్తం 9,80,978 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. 4 లక్షల 78 వేల 527 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా, 4 లక్షల 43 వేల 993 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ టాపర్ ఈమె..
తెలంగాణలో ఇంటర్ స్టేట్ టాపర్‌గా కూడా విద్యార్థినియే రావడం విశేషం. ఇంటర్ టీఎస్ ఇంటర్ ఫస్టియర్‌లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన చర్విత స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని ఇంటర్ మొదటి ఏడాదిలో 470 మార్కులకు గాను ఏకంగా 468 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అంటున్నారు. ఎంపీసీ గ్రూప్ తీసుకున్న చర్విత.. పరీక్షల్లో 468 మార్కులు సాధించింది. ఇంగ్లీష్- 99, సంస్కృతం- 99, మ్యాథ్స్ 1ఏ- 75, మ్యాథ్స్ 1బీ- 75, ఫిజిక్స్- 60, కెమిస్ట్రీ- 60 మార్కులు సాధించింది. చర్వితపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
ఇంటర్ రెండో సంవత్సరంలో స్టేట్ టాపర్ ఈమె..
ఇక ఇంటర్ స్టేట్ సెకండియర్‌లో కూడా టాపర్‌గా కూడా విద్యార్థినియే రావడం మరో విశేషం. ఇంటర్ టీఎస్ ఇంటర్ సెకండియర్‌లో అనుజ్ఞ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమెకు ఇంటర్ ఎంపీసీ(MPC) విభాగంలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి.. స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా అనుజ్ఞ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో ఇలాగే రాణించి.. ఉన్నత స్థానంకు వెళ్లాలన్నారు. మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు.
SOMISHETTY ANUGNYA కు ఇంటర్ మొదటి సంవత్సరంలో..
ENGLISH PAPER -Iలో 97 మార్కులు, SANSKRIT PAPER-Iలో 99, MATHEMATICS (A)లో 75, MATHEMATICS (B)లో 75, PHYSICS లో 60, CHEMISTRYలో 60 మార్కులు వచ్చాయి. మొత్తం మీద ఇంటర్ మొదటి సంవత్సరంలో 470మార్కులకు గాను 466 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
☛ Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!
అలాగే ఇంటర్ సెంకండియర్‌లో ENGLISH PAPER-IIలో 98 మార్కులు..
SANSKRIT PAPER-IIలో 99, MATHEMATICS(A) లో 75, MATHEMATICS(B)లో 75, PHYSICSలో 60, CHEMISTRYలో 60, PHYSICS PRACTICAL లో 30, CHEMISTRY PRACTICALలో 30 మార్కులు సాధిచింది. దీంతో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి 1000 మార్కులుగాను 993 మార్కులు సాధించి మరో రికార్డు క్రియేట్ చేసింది.
☛ After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!