Success Story : నాకు అమ్మానాన్న లేరు.. కానీ అమ్మ చివ‌రి కోరిక మాత్రం తీరుస్తా..

ఏడేళ్ల క్రితం నాన్న చనిపోయాడు.. పదోతరగతి పరీక్షలకు నాలుగు రోజుల ముందే అమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అమ్మానాన్నను కోల్పోయిన బాధను దిగమింగుకొని, పరీక్షలకు సిద్ధమయ్యాడు కరీంనగర్‌ అలకాపురి కాలనీకి చెందిన ప్రజ్ఞాంత్‌ రెడ్డి. ఇటీవ‌ల విడుదలైన ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల్లో 9.5 జీపీఏ సాధించాడు.
ప్రజ్ఞాంత్‌ రెడ్డి

మార్చి 31న కరీంనగర్‌ పద్మనగర్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థి తల్లి రజిత మృతి చెందింది. అతను నగరంలోని సిద్దార్థ పాఠశాలలో చదివాడు. అమ్మ బతికున్న రోజుల్లో పదోతరగతి పరీక్షలు బాగా రాయాలని చెప్పేదని, ఆ మాటలే నన్ను ప్రభావితం చేసి, 9.5 జీపీఏ తెచ్చుకునేందుకు కారణమయ్యాయని తెలిపాడు. తాను ఐఐటీలో చదవాలనేది అమ్మ కోరిక అని, అందులో సీటు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నాడు.

➤☛ Sanjana Bhat Secures 500/500 Marks in CBSE 10th Exam : 500/500 మార్కులు సాధించానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..!

ఆడపిల్లలని తండ్రి వదిలేశాడు.. కానీ అమ్మ మాత్రం..

కవల ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే అన్నీ అయి చదివించారు. వాళ్ల శ్రమ వృథా కాలేదు. ఆ కవలలిద్దరూ ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అల్లెంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఔట్‌సోర్సింగ్‌లో ఎల్రక్టానిక్స్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం కవితకు ఏడో నెల సమయంలో డెలివరీ కోసం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. కవల కూతుళ్లు పుట్టడంతో ఇక్కడే వదిలేశాడు.

☛➤ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

దీంతో అప్పటినుంచి వారి ఆలనపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రయివేటు స్కూల్‌లో, 6వ తరగతి నుంచి మోడల్‌సూ్కల్‌లో చదివారు. ఇటీవ‌ల విడుదలైన‌ ఎస్సెస్సీ ఫలితాల్లో ఇద్దరూ 10 జీపీఏ సాధించారు. ‘అమ్మమ్మ, తాతయ్యలు, ప్రిన్సిపాల్‌ జ్యోతి ప్రోత్సాహంతోనే 10 జీపీఏ సాధించాం’ అని శర్వాణి, ప్రజ్ఞాని చెప్పారు.

☛➤ 10th Class Student Success Story : అమ్మ లేదు.. నాన్నా ఉన్న రాడు.. ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొని టాప్ మార్కులు కొట్టిందిలా.. కానీ..

#Tags