Devasena: 18న టీచర్లు, పేరెంట్స్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో న‌వంబ‌ర్ 18వ తేదీన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన ఆదేశాలు జారీ చేశా రు.

సమావేశానికి కొన్ని మార్గదర్శకాలను న‌వంబ‌ర్‌ 16న‌ పాఠశాలవిద్య డైరెక్టరేట్‌ విడుదల చేసింది. విద్యార్థుల అకడమిక్‌ పురోగతిపై చర్చించాలని సూచించింది. యూడైస్‌ యాప్‌లో విద్యార్థులను చేర్చడం, పాఠశాల పురోభివృద్ధి తదితర అంశాలపై చర్చించాలని పేర్కొంది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ -  మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఎన్నికల నియమాలను ఈ సందర్భంగా విధిగా పాటించాలని తెలంగాణ‌ పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. కాగా, ఎన్నికల  నేపథ్యంలో ఇ లాంటి సమావేశాలు ఎలా నిర్వహిస్తామని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇవి రాజకీయ చర్చలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

తల్లిదండ్రుల కమిటీల్లో వివిధ పార్టీల వా రుంటారని.. పాఠశాల పురోభివృద్ధి అంశంపై ఒక వర్గం సమర్థిస్తే, ఇంకో వర్గం విమర్శలు చేసే వీలుందని చెబుతున్నారు. ఇవి ఉద్రిక్తతకు దారితీసే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే వరకూ ఇలాంటివి వద్దని అంటున్నారు. 

#Tags