Teacher Suresh: విద్యార్థి ప్రాణం కాపాడి.. తాను అస్వస్థతకు గురైన‌ ఉపాధ్యాయుడు.. కార‌ణం ఇదే..

తాంసి: ఓ విద్యార్థిని పాముకాటు వేయగా.. ఏమాత్రం ఆలోచించకుండా కాటు వేసిన గాయం నుంచి నోటితో రక్తాన్ని పీల్చాడో ఉపాధ్యాయుడు.

విషం పైకి ఎక్కకుండా దారంతో కట్టుకట్టాడు. వెంటనే బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందేలా చూశారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురికాగా సెప్టెంబర్ 10న రాత్రి రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని ధనోర ప్రాథమి కోన్నత పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థి యశ్వంత్‌ సెప్టెంబర్ 10న‌ పాముకాటుకు గురికావ డంతో ఉపాధ్యాయుడు సురేశ్‌ తక్షణమే ప్రథమ చికిత్స అందించారు.

చదవండి: 3 Days Holidays: విద్యార్థులకు వ‌రుస‌గా 3 రోజులు సెల‌వులు.. ఎందుకంటే..?

ప్రథమ చికిత్స సమయంలో పాముకాటు వేసిన చోట రక్తాన్ని నోటితో పీల్చడంతో సురేశ్‌ సెప్టెంబర్ 10న‌ రాత్రి ఆదిలాబాద్‌లోని తన ఇంటి వద్ద తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయ నను రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

పరిస్థితి మెరుగుపడటంతో మంగళవారం సెప్టెంబర్ 11న‌ డిశ్చార్జ్‌ చేశారు. ఈ విషయం తెలియడంతో డీఈవో ప్రణీత.. సురేశ్‌ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. విద్యార్థిని కాపాడినందుకు అభినందించారు.

సురేశ్‌ దంపతులను శాలు వాతో సన్మానించారు. అనంతరం విద్యార్థి చికి త్స పొందుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి మెరు గైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 

#Tags