Bairi Sarala: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించాలి
చెన్నారావుపేట: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడానికి, పరిశీలించడానికి స్టేట్ లెవల్ ఎడ్యూకేషన్ అచివ్‌మెంట్ సర్వే(సీస్) పరీక్ష ఉపయోగపడుతుందని మండల నోడల్ ఆఫీసర్ బైరి సరళ అన్నారు.
ఈ మేరకు మండలంలోని మోడల్ స్కూల్‌లో సోమవారం సీస్ పరీక్ష నిర్వహణపై పరీక్ష కేంద్రాల ప్రధానోపాధ్యాయులకు, ఫీల్డ్ ఇన్విస్టిగేటర్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
చదవండి: Tenth Exams: యూడైస్‌లో పేరుంటేనే 'పది' పరీక్షలకు అనుమతి
శిక్షణ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్‌పర్సన్ బాసాని రాయపురెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాపమ్మ, బోయినపల్లి ప్రభాకర్‌రావు, ప్రసన్నలక్ష్మి, సలీమ్, రవీందర్, జ్యోతి, యాకయ్య, వెంకటన్న కట్టస్వామి, ఇంద్రయ్య, ఎల్లయ్య, మహెందర్, హమీదబాను, దేవి, వెంకటేశ్వర్లు, విజేందర్, రవి, రమేష్, సంతోష్‌కుమార్, విజయ్, సురేష్, శాంతమేరి, సీఆర్‌పీలు ముదురుకోళ్ల సంపత్, బాలు, కందిక శిల్ప, హేమలతలు ఉన్నారు.
#Tags