Sanitation Workers: పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులేరీ?

సర్కారు బడుల్లో స్వీపర్ల కొరత వేధిస్తోంది. దీంతో పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

2021 స్కావెంజర్ల్‌ వ్యవస్థ రద్దు చేసి ఆ బాధ్యతలను పంచాయతీ కార్మికులకు అప్పగించారు. గ్రామ పంచాయతీలు జీతాలు సవ్యంగా చెల్లించకపోవడంతో సొంతగా డబ్బులు వెచ్చించి ఉపాధ్యాయులే నియమించుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పాపన్నపేట మండలంలో దుస్థితి ఇదీ.

వెంటనే స్కావెంజర్లను ఏర్పాటు చేయాలి

పాఠశాలలో స్కావెంజర్లను వెంటనే ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య కార్మికులు లేక, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుంది. దీంతో చేసేది లేక నెలకు రూ.3 వేలు సొంతత నిధులు చెల్లించి ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకున్నాం. ఏకోపాధ్యాయ పాఠశాలలు, తండా పాఠశాలల పరిస్థితి ఘోరంగా ఉంది.

–ప్రతాప్‌ రెడ్డి, హెచ్‌ఎం, పొడిచన్‌పల్లి
 

#Tags