Vakati Karuna: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

 డీఈవో సుశీందర్‌రావుతో కలిసి సెప్టెంబ‌ర్ 19న‌ ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి బోధన పరమైన అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే మన విద్యా వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. విద్యార్థుల బోధన తీరును పరిశీలించిన అనంతరం ప్రధానోపాధ్యాయుడు సురేశ్‌ను ఆమె అభినందించారు.

చదవండి:

DEO Ravinder: విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి

Telangana: బడి పిల్లలకు అల్పాహారం

Gopagani Ramesh: చదువుకున్న పాఠశాలకే హెచ్‌ఎంగా..

#Tags