PO Prateek Jain: ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఏప్రిల్ 28న చర్ల మండలం ఉంజుపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల, చర్ల గిరిజన బాలికల వసతి గృహం, సత్యనారాయణపురం గిరిజన బాలుర వసతి గృహం, దుమ్ముగూడెం మండలంలో రామచంద్రుని పేట గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు.
పాఠశాల, హాస్టల్ భవనాలు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వేసవి సెలవులు కావడంతో రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాల ఆవరణ, తరగతి గదులు, టాయిలెట్లు, బాత్రూంలు, డైనింగ్ హాలు, డార్మెటరీ హాల్‌ను శుభ్రం చేయకుండా ఉంచడంతో ఏటీడీఓ, హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: CBSE: ఇకపై ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు!
అనంతరం పీఓ మాట్లాడుతూ ఇంటిని మరిపించేలా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలలు తిరిగి జూన్ 12న ప్రారంభమవుతాయని, అంతకు వారం రోజుల ముందే మరమ్మతులు పూర్తి చేయించాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు.
పాఠశాల భవనాలకు వైట్‌వాష్ చేయించాలన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు స్థానికంగా ఉండి మరమ్మతు పనులు నాణ్యంగా చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ, స్పెషల్ ఆఫీసర్ నర్సింగ్ రావు, పాఠశాల హెచ్‌ఎంలు వీరమ్మ, సాయన్న, వార్డెన్‌లు ఈశ్వర్‌రావు, రాధమ్మ, వాల్‌సింహ ఉన్నారు.