MLA Jare Adinarayana: ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే!

అన్నపురెడ్డి పల్లి: రాజకీయాల్లోకి రాకముందు పీఈటీగా పనిచేసిన అనుభవం.. బోధనపై ఆసక్తి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైనా విద్యార్థులకు కొత్త అంశాలు తెలియజేయాలనే ఉత్సాహం కలగలిపి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తడానికి కారణమయ్యాయి!

విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచడంతో పాటు ప్రయోగాలను నేరుగా వివరించేలా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ‘ఫ్యూచరిస్టిక్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌’(ఫ్లో బస్‌) పేరిట వాహనాన్ని రూపొందించింది.

సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆవిష్కరించిన ఈ బస్సు తొలిసారి అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లికి జూలై 10న‌ వచ్చింది. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ప్రాంగణంలో 8, 9, 10వ తరగతులు, ఇంటర్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదినారాయణ స్వయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష ప్రయోగాలు, పరికరాల పనితీరును వివరించారు.

చదవండి: AI Teacher at School: నెక్ట్‌స్‌ జెన్‌ స్కూల్‌లో రోబో టీచర్‌.. దీని పేరు..!

విద్యార్థులు ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌లో ఎదగొచ్చని సూచించారు. ఎంపీడీఓ మహాలక్ష్మి, తహసీల్దార్‌ జగదీశ్వర్‌ప్రసాద్, ఎంఈఓ సత్యనారాయణ, ఫ్లో బస్‌ సంస్థ సీఈఓ మధులాష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.  

#Tags