DEO Radhakishan: మార్కులను ఆన్‌లైన్‌ చేయండి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో జరుగుతున్న సమ్మెటీవ్‌ పరీక్షలకు సంబంధించి ఆయా పాఠశాలల సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు వెంట వెంటనే వ్యాల్యువేషన్‌ చేసి రికార్డులు రూపొందించాలని డీఈఓ రాధాకిషన్‌ ఏప్రిల్ 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌– 2 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 19 వరకు ప్రాథమిక పాఠశాలలకు, 22వ తేదీతో ఉన్నత పాఠశాలలకు పరీక్షలు ముగియనున్నట్లు చెప్పారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు విద్యార్థుల ప్రశ్నపత్రాలను ఎప్పటికప్పుడు వ్యాల్యుయేషన్‌ పూర్తి చేయించి సంబంధిత మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

చదవండి: School Education Department: 23న విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు.. పుస్తకాలను వెనక్కి తీసుకోకూడదు..

ఏప్రిల్ 24న తప్పనిసరిగా విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయాలని తెలిపారు. అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు బాధ్యతగా ఈ విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

#Tags