Tenth Class Exams: ‘పది’లో సత్తా చాటుతాం
వారికి నేర్పించటంతో పాటు నేర్చుకున్న ది పరీక్షల్లో బాగా రాసేలా ప్రిపేర్ చేస్తున్నామని డీఈఓ రేణుక అన్నారు. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ చేస్తున్న కసరత్తు.. ఇందుకు తీసుకుంటున్న చర్యలను ఆమె ‘సాక్షి’కి వివరించారు. 2023 నవంబర్ 10 నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
హెచ్‌ఎంలతో కలెక్టర్ సమావేశం
గతంతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా కంటే ముందు జిల్లా 27వ స్థానంలో ఉండేది.. ఆ తరువాత ఏడాది బాగా కష్టపడటం వల్ల 24వ స్థానానికి చేరుకున్నాం. అయితే గతేడాది ఫలితాలు నిరాశ పరిచాయి. ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ముందుగానే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ఇప్పటికే కలెక్టర్ సైతం ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 13,074 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 10,541 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. 2,533 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఒక్కో రోజు ఇద్దరు ఉపాధ్యాయులు
పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే విషయంలో ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది మాదిరిగానే ప్రభుత్వమే స్నాక్స్ కోసం నిధులు సమకూర్చనుంది. ఒంటిపూట బడుల పమయంలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రతీ పాఠశాలలో రోజు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండి స్పెషల్ తరగతు లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా అభ్యసన దీపికలు అందజేసింది. ప్రీఫైనల్స్ పక్కాగా నిర్వహిస్తున్నాం.. ఒక రోజు పరీక్ష నిర్వహిస్తూ మరో రోజు విద్యార్థులు రాసిన పేపర్లపైన వారితో ఉపాధ్యాయులు డిస్కర్షన్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి గ్రూపులుగా విభజించి బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం.
వేకప్ కాల్స్ చేస్తున్నాం
విద్యార్థులకు బోధించి.. చదువుకోమని చెప్పి ఊరుకోకుండా వారు నిత్యం చదువుపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ఉదయం 5 గంటలకు విద్యార్థులకు వేకప్ కాల్స్ చేసి నిద్ర లేపుతున్నాం. వారి పేరెంట్స్‌తో మాట్లాడేలా ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాం. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయిస్తున్నాం. ఎవరైన స్లో లెర్నర్స్, ఇర్రెగ్యులర్స్ ఉంటే మా ఉపాధ్యాయులు వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.
హెచ్‌ఎంలు, ఎంఈఓలతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 161 హెచ్‌ఎం పోస్టులకు గాను 96 పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 662 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాల్లో కొన్ని చోట్ల సబ్జెక్టు తెలిసిన ఎస్జీటీలతో చెప్పిస్తున్నాం. జిల్లాను ఉన్నతంగా నిలిపించేందుకు సమష్టి కృషి చేస్తున్నాం.