Best Teachers: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యారణ్యపురి: జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు హెచ్‌టీటీపీ//నేషనల్‌ అవార్డ్స్‌టీచర్స్‌.ఎడ్యుకేషన్‌.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో జూన్ 15వ తేదీ వరకు అర్హులైన ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై తెలిపారు.

చదవండి: Intermediate Classes: ‘ఇంటర్‌’ క్లాసులు చెప్పేదెవరు? వేధిస్తున్న ఫ్యాకల్టీ కొరత

ప్రభుత్వ యాజమాన్యాల పరిధి ప్రాథమిక, యూపీఎస్‌, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ, జవహర్‌ నవోద య, సైనిక్‌ స్కూల్‌, ఆటమిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ, ఏకలవ్య, మోడల్‌, ఆశ్రమ, సెంట్రల్‌బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్‌చే అఫిలయేషన్‌ పొందిన సంస్థలు, ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ పొందిన పాఠశాలల ఉపాధ్యాయులు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ విధివిధానాలు నేషనల్‌ అవార్డ్స్‌ టీచర్స్‌ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

#Tags