Admissions: 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి: గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకులు, కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ సంగీత డిసెంబర్ 26న తెలిపారు.
4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.లక్షా 50వేల లోపు, పట్టణ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలన్నారు. ఫిబ్రవరి 11న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందని, విద్యార్థులు రూ.100 రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చదవండి:
Digital Education: రాష్ట్రంలో విద్యా వెలుగులు
Andhra Pradesh: ఫలించిన సర్కారు చదువుల యజ్ఞం.. సత్ఫలితాలనిస్తున్న విద్యా పథకాలు
#Tags