Text Books: ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాల అమ్మకాలపై స్పష్టత ఇవ్వండి

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య, నోటు పుస్తకాల అమ్మకం తీవ్ర వివాదం రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం కోరుతోంది. వివాదం నేపథ్యంలో సంఘం ప్రతినిధులు గతంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసారు.

పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అమ్మడం చట్ట విరుద్ధం కాదని, దీనిపై రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టత ఇచ్చిందని వివరించారు. దీంతో దీనిపై దృష్టి పెట్టిన అధికారులు.. స్కూళ్లపై దాడులు చేయవద్దంటూ కింది స్థాయి అధికారులకు అప్పట్లోనే ఆదేశాలు జారీ చేశారు. అయినా దాడులు కొనసాగుతుండటంతో ఈ వ్యవహారంపై స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి.  

చదవండి: Online Books: ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో పాఠ్య‌పుస్త‌కాలు..

ఏమిటీ వివాదం? 

ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాల అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం 2010లో జీవో విడుదల చేసింది. స్కూళ్ల యాజమాన్యాలు దీన్ని హైకోర్టులో సవాల్‌ చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాల కోసం అనేక చోట్ల తిరగకుండా, అవసరమైన స్టేషనరీ తామే అమ్ముతున్నామన్నారు. ఈ వాదనను హైకోర్టు సమర్థిస్తూ 2015లో ఉత్తర్వులు ఇచ్చింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా (నో ప్రాఫిట్, నో లాస్‌) అమ్ముకోవచ్చని తెలిపింది. అయితే ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖ జిల్లా అధికారులకు వివరించకపోవడంతో వారు తమపై దాడులు చేస్తున్నట్టు స్కూల్‌ యాజమాన్యాలు చెబు తున్నాయి.

చదవండి: Artificial Intelligence: ఈ రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశంగా ‘కృత్రిమ మేధస్సు’!
విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలు చేస్తున్నారని అంటున్నాయి. అయితే విద్యాశాఖ తాజాగా మే 27వ తేదీన ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, ఇతర స్టేషనరీ, యూనిఫాంలు, షూస్‌ అమ్మకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో యాజమాన్యాలు మరో సారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ వ్యవహారంపై పాఠశాల విద్య కమిషనర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు.  

అన్ని స్కూళ్లనూ ఒకే గాటన కట్టొద్దు 
రాష్ట్రంలోని 11,500 ప్రైవే టు స్కూళ్లకు గాను 10 వేలు బడ్జెట్‌ స్కూళ్లే. వీటి ల్లో ఫీజులు చాలా తక్కువ. విద్యార్థుల సౌక ర్యం కోసమే స్టేషనరీ నిర్వహిస్తున్నాయి.
ఒక్క పైసా కూడా ఇందులో లాభాలు తీసుకోవడం లేదు. అలా తీసుకున్నట్టు ఆధారాలుంటే చర్య లు తీసుకోవాలి. అంతే తప్ప పెద్ద స్కూళ్లు దోపిడీ చేస్తుంటే మమ్మల్ని హింసించడం అన్యాయం. 
– సాదుల మధుసూదన్‌ (ట్రస్మా అధ్యక్షుడు)   

#Tags