School Funds: పాఠశాలల్లో పరిశుభ్రతకు నిధులు

కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు నిధులు కేటాయిస్తూ ఆగ‌స్టు 5న‌ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై టీచర్లు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడుల్లో టాయిలెట్ల శుభ్రత, మొక్కలకు నీరు పోయడం, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచేందుకు ఈ నిధులు ఉపయోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి: Students Health : విద్యార్థుల బ్యాగుల భారం.. ఆరోగ్యాల‌పై భారీ ప్ర‌భావం.. దీనికి మేలు!

నిధుల కేటాయింపు ఇలా..

కరీంనగర్‌ జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 30 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలకు సర్కారు రూ.3 వేలు గ్రాంటుగా ఇవ్వనుంది. అలాగే, 31 నుంచి 100 మంది ఉన్న స్కూళ్లకు రూ.6 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500లోపు ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది ఉంటే రూ.15 వేలు, 750 మందికి పైన ఉంటే రూ.20 వేలు ఇస్తుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి ని ధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు
పాఠశాలల్లో పరిశుభ్రతకు నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఐదేళ్లుగా గ్రామ పంచాయతీ సి బ్బందికి స్కూళ్లలో పరిశుభ్రత బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించడం వల్ల పాఠశాలల్లో ఇక అపరిశుభ్రత ఉండదు.
 – శనిగరపు రవి, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
 

#Tags