DEO Wife: మూడేళ్లుగా స్కూల్‌కు వెళ్లని డీఈఓ భార్య?
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డీఈఓ రవీందర్ భార్య మూడేళ్లకు పైగా విధులకు హాజరుకావడం లేదని సమాచారం.
జిల్లా కేంద్రంలోని ఎర్రవల్లి తండాలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆమె.. మూడేళ్ల నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంటికే రిజిస్టర్స్ తెప్పించుకుని సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడంతో బాలానగర్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై అక్కడికి తీసుకువచ్చి పెట్టారు.
చదవండి: One Teacher : ఐదు తరగతులను బోధిస్తున్న ఒకే టీచర్.. గ్రామస్తుల ఆవేదన
అయితే మళ్లీ నెలరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఆమెను డిప్యూటేషన్‌పై శ్రీనివాసకాలనీ పాఠశాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే డీఈఓ భార్య లోకల్ బాడీ కింద పనిచేయాలి అంటే, గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలలో పని చేయాలి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కానీ చేతిలో అధికారం ఉందని మున్సిపాలిటీ పరిధిలో తమ ఇంటి పక్కనున్న పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు.
#Tags