Gurukula Teachers: 28న గురుకుల టీచర్ల చాక్‌డౌన్, పెన్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబ‌ర్ 28న చాక్‌డౌన్, పెన్‌డౌన్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా జేఏసీ ప్రతినిధులు సీహెచ్‌.బాలరాజు స్పష్టం చేశారు.

గురుకులాల్లో సమయపాలన మార్పు చేయాలంటూ సెప్టెంబ‌ర్ 23న‌ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.

చదవండి: Gurukul Institutions: సరస్వతి నిలయాల్లో.. కాలకృత్యం.. నిత్య నరకం!

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకుల ఉద్యోగుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, జేఏసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శులు, సొసైటీ కార్యదర్శులకు ప్రత్యేకంగా వినతులు సమర్పించినట్లు చెప్పారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags