Jobs: 22 వేల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు

ఎట్టకేలకు విద్యాశాఖలోని ఖాళీ పోస్టుల లెక్క తేలింది. నియామకాలకు మార్గం సుగమమైంది.
22 వేల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు

మంజూరైన బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య 1.31 లక్షలు కాగా, ప్రస్తుతం విధుల్లో ఉన్నవారి సంఖ్య 1.09 లక్షలు. అంటే ఇంకా 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇందులో ప్రధానమైనవి ఉపాధ్యాయపోస్టులే. ఇంతకాలం టీచర్‌ పోస్టుల లెక్క కచ్చితంగా లేక పోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత విభజన జరగకపోవడంతో విద్యాబోధనలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని స్కూళ్లల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు కూడా లేరు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్‌ సెలవు పెడితే ఇక అంతే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానంలో భాగంగా జిల్లాస్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించేం దుకు విధివిధానాలు వెల్లడించింది. దీంతో టీచర్ల స్థానికత కూడా తేలిపోతుంది. అప్పుడు ఏ జిల్లాకు ఎంతమంది ఉపాధ్యాయులనేది ఖచ్చితంగా లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న టీచర్‌పోస్టుల భర్తీ ప్రక్రియ ఎలా చేపడతారనేది విద్యాశాఖలో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

విభజనతోనే ముగింపు:

విద్యాశాఖ అధికారులు గత కొన్ని నెలలుగా కొత్త జిల్లాలవారీగా టీచర్ల విభజనపైనే దృష్టిపెట్టారు. కేడర్, సబ్జెక్టు, మీడియంవారీగా క్షేత్రస్థాయిలో విభజన చేపట్టారు. ఈ లెక్కన మొత్తం 351 కేడర్లు ఉన్నట్టు పాఠశాల విద్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాదాపు 575 మండలాలకు ఎంఈవోలు, 22 జిల్లాలకు డీఈ వోలు, 63 చోట్ల ఉప విద్యాధికారులను నియమిం చాల్సి ఉంది. టీచింగ్‌ స్టాఫ్‌ విషయానికొస్తే మంజూ రైన పోస్టుల్లోనే 1,970 గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లు, 8,151 మంది అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల పోస్టులు, 1,971 ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6,011 సెకెండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల భర్తీ అవసరం. వీరితోపాటు 309 మంది భాషాపండితులు (అప్‌గ్రేడ్‌ చేసే ఈ సంఖ్య 10 వేలవరకూ ఉండొచ్చు), పీఈటీలు 60 మంది, క్రాఫ్ట్‌ టీచర్లు 450 మందిని తీసుకోవాలి. ఇవన్నీ కేవలం మంజూరైన పోస్టుల్లో ఏర్పడ్డ ఖాళీలే. ప్రతి స్కూల్‌కు అటెండర్, స్కావెంజర్స్, రికార్డు అసిస్టెంట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. వీటిని కొత్తగా మంజూరు చేస్తే పెద్దఎత్తున నియామకాలు చేపట్టాలి.

చదవండి: 

KGBV: పోస్టుల భర్తీకి పక్కా రూల్స్‌

958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌.. వాటి వివరాలు

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

#Tags