TET: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

మంచిర్యాలఅర్బన్‌: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించి కోర్టు కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, పదోన్నతులకు ఉన్న ఆటంకం తొలగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ కోరారు.

మంచిర్యాలలో ఆదివారం యూని యన్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వెంకట్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు మంజూరు చేయాలన్నారు. సీపీఎస్‌ విధానం రద్దుచేయాలని కోరారు. కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ సమగ్రశిక్ష ఉద్యోగులు, గిరిజన, సంక్షేమ, సాంఘిక, మైనార్టీ, బీసీ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గెస్ట్‌ తదితర సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఉన్నత పాఠశాలలనే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామన్న, ప్రధాన కార్యదర్శి రాజావేణు, ఉపాధ్యక్షుడు చక్రపాణి, లావణ్య, కోఽశాధికారి కిరణ్‌, జిల్లా కార్యదర్శులు నర్సయ్య, చంద్రమౌళి, సంతోష్‌కుమార్‌, కిరణ్‌ తదితరులుపాల్గొన్నారు.
 

#Tags