Good News for TET Candidates: ఉచితంగా TETపై ప్రత్యక్ష ప్రసారాలు, 200 ఎపిసోడ్స్‌ డొమైన్‌లో అందు బాటులో..

సాక్షి, హైదరాబాద్‌ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు హాజరయ్యే అభ్యర్థులకు టీ– శాట్‌లో మెళకువలతో పాటు సలహాలు, సూచనలు అందిస్తామని సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

ఐదు సబ్జెక్టులపై మే 15వ తేదీ నుంచి 18 వరకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో టీసాట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని మే 14న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు  టెట్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 15న సైకాలజీ, 16న టీచింగ్‌ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్‌ సైన్స్, మాథ్స్‌ సబ్జెక్ట్‌లపై  ప్రత్యక్ష  ప్రసారాలు ఉంటాయన్నారు.

చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

ప్రసారాలు నిపుణ చానల్‌తోపాటు టీ– సాట్‌ విద్యా చానల్‌లో మరుసటి రోజు సాయ ంకాలం 5 నుంచి 6 గంటల వరకు పున:ప్రసా రమవుతాయని వివరించా రు.

ఇప్పటికే టెట్‌ అభ్యర్థుల కోసం 200 ఎపిసోడ్స్‌ టీ–సాట్‌ డొమైన్‌లో అందు బాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలు, సందేహాలు–సమాధానాల కోసం 040–3540 326/726, టోల్‌ ఫ్రీ నంబరు1800 425 4039 కు ఫోన్‌ చేయొచ్చని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.     

#Tags