TSPSC Group 1 Notification: తెలంగాణలో 563 గ్రూప్‌–1 పోస్టులు.. ప్రిలిమ్స్ పరీక్ష ఆ రోజునే!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 563
అర్హత: ఆర్టీవో పోస్టుకు మెకానికల్, ఆటోమొబైల్‌ ఇంజనీరంగ్‌ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా పోస్టులన్నింటికీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏసీఎల్‌ పోస్టులకు డిగ్రీతోపాటు సోషల్‌ వర్క్‌లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: యూనిఫామ్‌ సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌), పోస్టులకు 35 ఏళ్లు కాగా, మిగిలిన పోస్టులకు 46 ఏళ్లు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వర­కు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఓటీఆర్‌ తప్పనిసరి: కమిషన్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌)లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్‌ లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్, మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా పేర్కొనాలి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం
ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందు­లో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో అర్హత పొందిన వారికి మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు.
 
మెయిన్స్‌ పరీక్ష: ఈ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్‌ 150 మార్కులు, పేపర్‌–1 సమకాలీన అంశాలపై సాధారణ వ్యాసం (జనరల్‌ ఎస్సే)–150 మార్కులు, పేపర్‌–2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం–150 మార్కులు, పేపర్‌–3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పాలన–150, పేపర్‌–4 ఆర్థిక శాస్త్రం, అభివృద్ధి–150 మార్కులు, పేపర్‌–5 సైన్స్, టెక్నాలజీ అండ్‌ డెటా ఇంటర్‌ప్రిటేషన్‌–150, పేపర్‌–6 తెలంగాణ ఆలోచన(1948–70), సమీకరణ దశ(1971–90), తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వైపు(1991–2014)–150 మార్కులు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తులకు చివరితేది: 14.03.2024.
  • దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం: 23.03.2024 ఉదయం 10 గంటల నుంచి 27.03.2024 సాయంత్రం 5 గంటల వరకు;
  • ప్రాథమిక పరీక్ష: 2024, జూన్‌ 9 
  • మెయిన్స్‌: సెప్టెంబర్‌/అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం. 


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చదవండి: SCCL Recruitment 2024: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags