Young Woman Achieves SI Post: తొలి ప్ర‌య‌త్నంలోనే ఎంపికైంది ఈ యువ‌తి.. ఎలా?

చదువు రంగంలోనే కాకుండా ఇత‌ర రంగాల్లో కూడా ముందుండి అన్ని విష‌యాల్లోనూ క‌న‌బ‌ర్చింది ఈ యువ‌తి. అలా త‌మ తల్లిదండ్రుల స‌హ‌కారం కూడా పొంది వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టింది. ఈ యువ‌తి ఎస్ఐగా ఎలా ఎంపికైందో తెలుసుకుందాం..
SI post achiever Manisha

కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన వస్కుల రాంచందర్‌, వనజ దంపతుల కూతురు మనీషా సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. మనీషా తండ్రి తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. తల్లి, మహిళా సంఘాల్లో సీఏగా పనిచేస్తున్నారు. మనీషా చిన్నప్పటి నుంచి బాగా చ‌దివేది. పోలీస్‌ ఈవెంట్లలోనూ మంచి ప్రతిభ కనబర్చింది.

Singh Is King.. 21 yr old boy Becomes Judge: సింగ్ ఈజ్ కింగ్‌... 21 ఏళ్లకే జడ్జ్‌... రాజస్థాన్‌ యువకుడు సంచలనం

 

ఎస్ఐ ప‌రీక్ష ప్ర‌యాణం

చ‌దువులోనే కాకుండా, ఇత‌ర విష‌యాల్లో కూడా ముందే ఉంటుంద‌ని. అంతే కాక పోలీసు ఉద్యోగంలో త‌న‌కు ఆసక్తి క‌ల‌గ‌డంతో అన్నీ రంగాల్లో ముందుండాల‌ని అనుకుంది. అందుకని, త‌నూ పోలీస్ శాఖ‌లో పని చేయాల‌నుకోవ‌డంతో ప‌రీక్ష‌కు స‌ద్ధ‌ప‌డింది. త‌న కృషి, త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతోనే త‌ను ముంద‌డుగు వేసి, ప‌రీక్ష‌లు రాసింది. అలా, త‌న‌ తొలి ప్రయత్నంలోనే ఎస్సైగా ఎంపికైంది.

APPSC Group 1 Rankers Success Stories : ఒకే ఇంట్లో అన్నదమ్ములకు గ్రూప్-1 ఉద్యోగాలు.. కొట్టారిలా..

ఈ విష‌యాన్ని తెలుసుకున్న త‌ను, త‌న త‌ల్లిదండ్రులు ఎంతో ఆనంద ప‌డ్డార‌ని మనీషా తెలిపారు. కాగా, మనీషాను గ్రామస్తులు కూడా త‌న‌ను అభినందించారు వారి హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. వారి కూతురు త‌న  నమ్మకాన్ని నిలబెట్టిందని, త‌మ‌ను గ‌ర్వ‌ప‌డే స్థాయికి ఎదింగింద‌ని మ‌నీషా  తల్లిదండ్రులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#Tags