Success Story of Doographics Founder : కేవలం రూ.9వేల‌తో ప్రారంభించా.. నేడు కొన్ని కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నా.. నా స్టోరీ ఇదే..!

జీవితంలో ప‌ట్టుద‌ల ఉంటే, ఎంత‌టి విజ‌యాన్నైనా సాధించ‌గ‌లం. ఎన్ని అడ్డంకులు వ‌చ్చిన మ‌న‌లో ఉండే ప‌ట్టుద‌ల‌, కృషి, త‌ప‌న అన్నింటిని దాటేలా చేస్తుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అందరూ ప్ర‌యత్నాలు చేస్తూ ఓడిపోతూ ఉంటారు. కొంద‌రు అందులో వారు చేసిన త‌ప్పులు, త‌ప్ప‌టడుగుల‌ను గ‌మ‌నించి స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌ధ్య‌లో ఎన్ని విధాలుగా ఆడుగును ఆపాల్సి వ‌చ్చిన ప‌ట్టుద‌ల‌ను వీడ‌రు కొంద‌రు. అటువంటి ఒక యువ‌కుని క‌థే ప్ర‌స్తుతం, మ‌నం తెలుసుకోనున్న‌ది. అత‌నే.. దాసాహెబ్ భ‌గ‌త్‌.

               

కూలి ప‌నులు చేస్తూనే..

భ‌గ‌త్ మ‌హారాష్ట్రకు చెందిన వ్య‌క్తి. ఇత‌ను బీడ్ గ్రామంలోని ఒక‌ పేద కుటుంబంలో 1994లో జ‌న్మించాడు. ఇత‌నికి జీవితంలో ఏదైనా చేయాల‌న్న ఆశ గ‌ట్టిగానే ఉండేది. జీవితంలో ఎన్ని క‌ష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిల‌బ‌డాల‌ని అనుకుంటాడు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అయితే, త‌న‌ కుటుంబం అంతా చెరుకు తోట‌లో కూలీ ప‌ని చేస్తూ జీవించే వారు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా భ‌గ‌త్ కూడా త‌న ప‌దో త‌ర‌గ‌తిని అంద‌రితో ప‌నికి వెళ్తూనే పూర్తి చేశాడు. అనంత‌రం, పూణెకు వెళ్లి అక్క‌డ ఐటీఐ కోర్సులో చేరాడు. తాను చ‌దువుకుంటూనే త‌న జీవ‌నం కోసం చిన్న చిన్న‌ ప‌నుల‌కు వెళ్లేవాడు. 

➥   Four Sisters Doctor Success Story : నలుగురు కూతుళ్లేనా.. అని హేళన‌ చేశారు... కానీ ఇప్పుడు ఈ న‌లుగురు...

ఆఫీస్ బాయిగా.. 9వేల‌తో ప్రారంభం..

త‌న చ‌దువు ముగిసింది. జీవితంలో ఏదో చేయాల‌న్న ల‌క్ష్యం త‌న‌ను వెంటాడుతూ ఉండేది. ఇంట్లో అన్ని క‌ష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికి, త‌న కృషి, కుటుంబం తోడుతో ప్రాథమిక విద్య‌ను పూర్తి చేసుకున్నాడు. త‌న పాఠ‌శాల విద్యా పూర్తి అయిన వెంట‌నే ఐటీఐ కోర్సు చేసేందుకు పూణె వెళ్లాడు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అక్క‌డ కూడా త‌న చ‌దువుతోపాటు వివిధ ఉద్యోగాలు చేయ‌డం ప్రారంభించాడు. అలా, కొంత సమ‌యంలో త‌న కోర్సు పూర్తి చేసుకున్నాడు. అనంత‌రం, త‌న‌కి ప్ర‌ముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసీస్ గెస్ట్ హౌస్‌లో ఆఫీస్ బాయ్‌గా 9 వేల జీతంతో ఉద్యోగం వ‌చ్చింది. కొన్ని రోజుల‌పాటు అక్క‌డే ప‌ని చేశాడు.

➥   IAS Rukmani Riar Real Story : అప్పుడు చ‌దువులో ఫెయిల్‌... కానీ ఇప్పుడు అంద‌రికి షాక్.. ఏకంగా ఐఏఎస్ ఆఫీస‌ర్‌ అయ్యారిలా.. కానీ..

ఉద‌యం ఉద్యోగం.. రాత్రి కోర్సు..

ప‌ని ఏదైనా కాని, ఆలోచ‌న‌లో మాత్రం జీవితంలో ఎదైనా పెద్ద‌ది చేయాల‌న్ని ఆశ గట్టిగానే ఉంది. దీంతో, ఉద‌యం ఆఫీస్ బాయిగా, రాత్రి స‌మ‌యంలో యానిమేష‌న్ కోర్సు చేసేవాడు. ఇందుకు త‌గ్గిన శిక్ష‌ణ కేంద్రంలో రాత్రి స‌మ‌యంలో శిక్ష‌ణ పొందేవాడు. ఈ కోర్సుతో ముంబైలో ఒక మంచి ఉద్యోగం దక్కింది.

➥   Two Sisters Success Story : ఓ తండ్రి క‌థ‌.. త‌మ‌ ఇద్ద‌రి కూతుర్ల‌ను ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలుగా చేశాడు ఇలా.. కానీ...

దీంతో ఉద్యోగంతో పాటు సీ++, పైథాన్ వంటి కోర్సులు కూడా పూర్తి చేశాడు. ఇలా, త‌న చ‌దువును, పార్ట్ టైం జాబ్‌ను స‌మానంగా పూర్తి చేసుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా త‌నకు ఉన్న ప‌ట్టుద‌ల వెనుక‌డుగు వేయ‌నివ్వ‌లేదు. 

                

పెద్ద ప్ర‌మాదం.. వీడ‌ని ప‌ట్టుద‌ల!

త‌న కోర్సు పూర్తి చేసుకున్నాక భ‌గ‌త్‌కు డిజైన్‌, గ్రాఫిక్స్ కంపెనీతో ప‌ని చేయ‌డం ప్రారంభించాడు. ఈ స‌మ‌యంలో టెంప్లేట్ల లైబ్ర‌రీలో ప‌ని చేయ‌డం గొప్ప అవ‌కాశ‌మ‌ని భావించాడు. ఈ ప‌నిని ఆన్‌లైన్‌లోనే అమ్మ‌డం ప్రారంభించాడు. అంతా స‌వ్యంగా సాగుతుంది అనుకున్న స‌మ‌యంలో భ‌గ‌త్‌కు పెద్ద ప్ర‌మాదం జ‌రిగింది. ఈ కారణంగా కొన్ని నెల‌ల‌పాటు మంచానికే ప‌రిమితం అయ్యాడు. ఈ స‌మ‌యంలో కూడా త‌న ప‌ట్టుద‌లతో ఇంట్లో నుంచే ప‌ని  చేయ‌డం ప్రారంభించాడు.

   Success Story of a Mother : ముగ్గురు ఆడ‌పిల్ల‌ల జీవితాల్లో వెలుగున ఒంట‌రి త‌ల్లి.. ఇదే ఆ అమ్మ పోరాటం క‌థ‌..

మొద‌ట్లో 9వేలు, ప్ర‌స్తుతం కొన్ని ల‌క్ష‌లు..

ఇక 2015లో నింత్‌మోషన్ అనే స్టార్టప్‌ని భగత్ ప్రారంభించాడు. అతి తక్కువ వ్యవధిలోనే 6 వేల మంది కస్టమర్‌లు అతనితో చేరారు. ఇక లాక్డౌన్ సమయంలో అతను గ్రామానికి వెళ్లవలసి వచ్చింది.

గ్రామంలోని గోశాలలో టెంపరరీ ఆఫీస్ ను ఏర్పాటు చేశాడు. అతను కాన్వా మాదిరిగానే సులభమైన డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. అలా ఒకప్పుడు రూ.9వేలకు పనిచేసిన భగత్ నేడు లక్షలు సంపాదిస్తున్నారు.

మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని ప్ర‌శంస‌లు..

ఇలా, ప్ర‌తీ ప‌నికి, చ‌దువుకు త‌న వంతు కృషి, ప‌ట్టుద‌ల అంకిత‌భావంతో తాను చేసే ప్ర‌య‌త్నాలన్నీ ఫలించాయి. అంద‌రి నుంచి అభినంద‌న‌లు పొందాడు. త‌న ప్ర‌యాణాన్ని ఒక పాఠంగా దిద్దాడు.

అయితే, త‌న ఈ విజ‌యాన్ని 26 సెప్టెంబర్ 2020న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా భగత్ పనిని,అంకితభావాన్ని ప్రశంసించారు. చిన్న సమస్యకే మానసిక ఒత్తిడికి గురయ్యే యువత భగత్ ను ఆదర్శంగా తీసుకోవాలి.

➥  TG DSC Candidates Success Stories : ఈ ఊరు నుంచి 5 మంది ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా... కానీ వీరు మాత్రం...

#Tags