Women Achieves 6 Gold Medals in University Level : ఆర్థిక కష్టాలు.. పానీపురి వ్యాపారం.. యూనివర్సిటీ స్థాయిలో ఏకంగా ఆరు మెడల్స్ సాధించిన రికార్డు.. ఇదే తన సక్సెస్ స్టోరీ!
సాక్షి ఎడ్యుకేషన్: గమ్యం ఏదైనా, దూరం ఎంతైనా సాధించాలి అనే తపన, పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించాగలం. జీవితంలో అన్ని రకాల కష్టాలూ ఉంటాయి. అలా, చాలామంది జీవితంలో ఆర్థిక కష్టాలు చాలా సాధారణం. అయితే, ప్రతీ కష్టంలో మనం చూపించే ధైర్యాన్నే ఇందులోనూ చూపించాలి. ఎంతటి కష్టాన్ని దాటుకొని ముందుకు సాగితే అంతటి విజయాన్ని చేరుకోగలం. ఇటువంటి ఒక జీవితమే ఒక విద్యార్థినిది. తన కలను సాకారం చేసుకునేందుకు ఆర్థికంగా ఎంత కష్టాల్లో ఉన్న కూడా చదువులో, తెలివిలో మాత్రం చాలా ఎత్తులోనే ఉంది.
Dipali Goenka Success Story: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్.. ఎవరీ దీపాలి?
ఆశయం డాక్టర్.. కాని..
కర్నూల్‌లోని గాయత్రి ఎస్టేట్ ప్రాంతానికి చెందిన వారు సురేంద్ర సరస్వతి దంపతులు. వారికి ఇద్దరు కూతుర్ళు ఉండగా వారిలో ఒకరు కోమల్ ప్రియా. ఈ అమ్మాయికి చదువంటే చాలా ఇష్టం, డాక్టర్ కావాలన్నదే ఈ విద్యార్థిని కోరిక. కాని, ఇందుకు చాలా డబ్బు ఖర్చు ఉంటుందని కష్టపడి నీట్ పరీక్ష రాసింది. కాని, అనుకున్న ర్యాంకు రాలేదు. దీంతో నిరాశ చెందింది కాని, ఓటమిని ఒప్పుకోలేదు. నీట్‌లో అనుకున్న విజయం దక్కకపోయినా, బీఎస్సీ అగ్రికల్చర్‌లో ఉచిత సీటు సాధించింది. దీంతో నంద్యాల జిల్లా మహానందిలోని ఆచార్య ఎన్జీ రంగా కళాశాలలో చేరింది.
ఇద్దరు ఉన్నత విద్యను పొందాలి..
ఇలా తన తల్లిదండ్రుల ఆర్థికంగా పడే ప్రతీ కష్టాన్ని తొలగించాలని ఇద్దరు కూతుర్ళు అత్యంత శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ముందుకు సాగారు. వాళ్ల తండ్రి కూడా ఇద్దరు ఆడపిల్లలు గొప్పగా చదువుకొని ఉన్నతంగా ఎదగి, వారి కళ్లపై నిలవాలని కోరి ఏమాత్రం వెనకడుగు వేయకుండా చదివించారు.
ఏకంగా ఆరు..
కళాశాలలో చేరిన సమయంలో అక్కడ నిర్వహించిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌కు ఎంపికైంది. ఇలా, కష్టపడుతూ, పట్టుదలతో చదివి విశ్వవిద్యాలయ చరిత్రలో ఎవరి సాధ్యం కాని విధంగా ప్రియా ఆరు బంగారు పతకాలను సాధించి అందరి అభినందనలు పొందింది.
జిల్లా స్థాయిలో 27వ ర్యాంకు
ఉన్నత విద్య కోసం ఎమ్మెస్సీలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాయగా అందులో జిల్లాలో 27వ ర్యాంకు సాధించింది. దీంతో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ ఇన్ స్ట్యిట్యూట్‌లో సీటు లభించింది. ఇక్కడ తను ఎంచుకున్న కీటక శాస్త్ర విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి పీహెచ్‌డీకి పరీక్షలు రాసింది. ప్రస్తుతం, వాటికి సంబంధించిన ఫలితాల కోసం వేచి చూస్తోంది.
చిన్న వ్యాపారంతోనే అందరికీ ఆదర‍్శవంతురాలుగా..
జీవితంలో.. ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రియా అసలు ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదు. మరింత కృషితో పట్టుదలతో చదివి ముందుకు నడిచి స్పూర్తిదాయకంగా నిలిచింది. ఒక చిన్న పానీపూరి వ్యాపారం చేస్తూనే ఉన్నత విద్యను పొందింది కోమల్ ప్రియా. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఏదో ఒక దారి ఉంటుందని, చేరుకోవాలన్న పట్టుదల, శ్రమ ఉంటే ఎంతటి దూరంలో ఉన్న గమ్యాన్నైనా చేరుకోగలం అని నిరూపించారు ప్రియా. ఇలా, ప్రతీ విద్యార్థులు, పిల్లలు, జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా ధైర్యంగా నిలిచి, ప్రతీ మెట్టు ఎక్కుతూ తమ గమ్యానికి చేరే ప్రయత్నం చేయాలి.
Modem Vamsi Success Story: కూలీగా మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు కామన్‌వెల్త్ వరకు
Tags
- Success Story
- gold medal student
- university topper
- higher education
- success journey of student
- success journey of university topper
- success and inspiring journey of gold medalist
- Komal Priya inspiring journey
- University topper Komal Priya Success story
- mini business and great success
- Women Success Story
- women achievement with small business
- financial struggle to university topper
- six gold medals achiever komal priya success story
- latest success stories in telugu
- university topper komal priya news
- komal priya success story
- komal priya success story as university topper
- gold medalist komal priya success story
- Education News
- Sakshi Education News
- students success journey news in telugu
- women inspiring story
- sakshieducation success story