Success and Inspiring Story of Shraddha Dhawan : పాల వ్యాపారం చేస్తూ.. ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నానిలా.. నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..!

ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. చిన్న‌త‌నం నుంచే ఇంటి బాధ్య‌త‌ల‌ను మోస్తూ ఆర్థికంగా స్థిర‌ప‌డేందుకు త‌న కుటుంబానికి స‌హాయంగా నిలిచింది.

ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. చిన్న‌త‌నం నుంచే ఇంటి బాధ్య‌త‌ల‌ను మోస్తూ ఆర్థికంగా స్థిర‌ప‌డేందుకు త‌న కుటుంబానికి స‌హాయంగా నిలిచింది. విక‌లాంగుడేన త‌న తండ్రికి తొడుగా ఉండి పాల వ్యాపారాన్ని ప్రారంభించింది. అది కాస్త ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారి గొప్ప స్థాయిలో నిలిచింది. ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయే క‌థ ఈ యువ‌తిదే..

చ‌దువుకుంటూనే..

జీవితంలో ఉన్న‌త స్థాయికి చేరాలంటే ఎంత కృషి, ప‌ట్టుద‌ల అవ‌స‌ర‌మో అంతే స‌హ‌నం అవ‌స‌రం. మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డ్డ‌, ఎంత ప‌ట్టుద‌ల‌తో ఉన్న కూడా ఎదురుచూపు చాలా అవ‌స‌రం. చిన్న‌త‌నంలో ఎవ‌రైనా చ‌దువుకుంటారు, ఆడుకుంటారు, స్నేహిత‌ల‌తో గ‌డుపుతారు.

కాని, ఈ యువ‌తి త‌న 11 ఏళ్ల వ‌య‌సులోనే త‌న కుటుంబానికి స‌హ‌కారంగా నిలిచింది. త‌న చ‌దువును కొన‌సాగిస్తూనే పాల వ్యాపారం మొద‌లుపెట్టింది. జీవితంలో ఎటువంటి ఆశ‌లు, ల‌క్ష్యాలు లేక‌పోయినా.. కుటుంబానికి తోడుగా నిల‌వాల‌నుకుంది. కాని, ఇప్పుడు ఈ యువ‌తి ఎందరికో ఆద‌ర్శంగా నిలిచి, గొప్ప స్థానానికి ఎదిగింద.
HS Keerthana IAS Stroy : అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క‌లెక్ట‌ర్‌.. ఈ నటి సక్సెస్ జ‌ర్నీ మాత్రం విచిత్రమే..! ఎందుకంటే..?
పాల వ్యాపారం చేస్తూ..

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన శ్ర‌ద్ధ, త‌న తండ్రి స‌త్య‌వాన్ ఒక విక‌లాంగుడు. అయితే, త‌న తండ్రి కోసం ఇంట్లోనే ఉంటూ పాల వ్యాపారం ప్రారంభించింది. ఒకవైపు చ‌దువును కొన‌సాగిస్తూనే మ‌రోవైపు పాల వ్యాపారాన్ని నెట్టుకొచ్చింది. ప్రతీరోజు పాలు పితికి ద‌గ్గ‌ర‌లోని డైరీ ఫార్మ్‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం త‌న ప‌నిగా మారింది. 

పాడి పరిశ్ర‌మ‌ను..

ఇలా సాగుతూ.. పాలు పిత‌క‌డం నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం నేర్చుకునే స్థాయికి ఎదిగింది. త‌న ఈ ప్ర‌యాణంలో శ్ర‌ద్ధ ఎటువంటి రుణాల‌ను తీసుకోలేదు. ఏం చేసినా త‌న తెలివితేట‌ల‌తోనే చేసింది. ఇంటివ‌ద్ద ఉన్న గేదెల పాల‌ను పితికి అమ్ముకోవ‌డం నుంచి ఏకంగా ఒక డైరీ ఫార్మ్‌ను ఏర్ప‌ర్చుకుంది శ్ర‌ద్ధ‌. ఇదంతా కేవ‌లం 13, 14 ఏళ్ల వ‌య‌సులోనే చేసి, ఇప్పుడు పాడి ప‌రిశ్ర‌మ‌ను స్థాపించింది.
Inspirational Interview : నేను రైతు బిడ్డ‌ను...మొద‌టి ప్ర‌య‌త్నంలోనే..TSPSC EOలో స్టేట్ 1st ర్యాంక్ కొట్టానిలా...కానీ..
24 ఏళ్ల వ‌య‌సులోనే..

ఇలా కొన‌సాగుతుండ‌గా శ్ర‌ద్ధ ఎన్నో లాభాలు పొందింది. అంతేకాకుండా, 2017 నాటికి త‌న పొలంలో 45 గేదెలు ఉండేలా శ్ర‌మించింది. ఇక్క‌డిదాక వ‌చ్చిన శ్ర‌ద్ధ‌, త‌న వ్యాపార ప్ర‌య‌త్నాల‌ను వైవిధ్యంగా మార్చుకొని, వ‌ర్మీకంపోస్టింగ్‌లోకి ప్ర‌వేశించింది. నెలకు గణనీయమైన 30,000 కిలోల వర్మీకంపోస్ట్‌ను ఉత్పత్తి చేసింది.

ఇకపోతే సీఎస్ ఆగ్రో ఆర్గానిక్స్ బ్రాండ్ కింద విక్రయించింది. అలాగే ఆమె ఒక బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, దానిలో గేదెల వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసి, జీరో వేస్టేజ్ వ్యాపారంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది.
Women Achieves 6 Gold Medals in University Level : ఆర్థిక క‌ష్టాలు.. పానీపురి వ్యాపారం.. యూనివ‌ర్సిటీ స్థాయిలో ఏకంగా ఆరు మెడ‌ల్స్ సాధించిన రికార్డు.. ఇదే త‌న స‌క్సెస్ స్టోరీ!
అంతేకాకుండా.. శ్రద్ద ఆమె ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఆమె అడుగుజాడల్లో అనుసరించడానికి ఇతరులతో ఆమె తన జ్ఞానం, అనుభవాన్ని పంచుకుంటుంది. ఇంత‌లా కృషి ప‌ట్టుద‌ల‌తో త‌న జీవితంలో ఇంత ఉన్న‌త స్థానానికి ఎదిగిన శ్ర‌ద్ధ ఇదంతా కేవ‌లం 24 ఏళ్ల వ‌య‌సులే ద‌క్కించుకుంది.

శ్ర‌ద్ధ.. ఒక పాడి ప‌రిశ్ర‌మ‌గా..

24 ఏళ్ల వ‌య‌సులోనే ఒక పాడి ప‌రిశ్ర‌మగా ఎదిగిన శ్ర‌ద్ధ ప్ర‌స్తుతం, త‌న వ‌ద్ద 130 గేదెలు ఉన్నాయి. శ్రద్ధా ఫామ్స్‌కు పొలంలో 1 టన్ను బయోగ్యాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. చివరికి, త‌న పొలాలు కూడా అన్ని విధాలుగా పెరిగాయి. దీంట్లో, గేదెల సంఖ్య పెరిగి, కార్మికులు, రైతుల సంఖ్య కూడా పెరిగింది. వ్యవసాయం స్వయం సమృద్ధి సాధించే సామర్థ్యం కూడా పెరిగింది. ఇలా, త‌న చ‌దువుతోనే కాకుండా, త‌న తెలివితో గొప్ప విజ‌యాల‌ను, గొప్ప స్థానాన్ని అందుకుంది శ్ర‌ద్ధ‌.

Alibaba Founder Jack Ma Inspiring Story: ఎగ్జామ్‌లో ఫెయిల్‌.. ఒక్క ఉద్యోగానికి కూడా సెలక్ట్‌ కాలేదు, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే కోటీశ్వరుడిగా..

#Tags