Success Story of Ankush Sach Dev : మైక్రోసాఫ్ట్ ఉద్యోగానికి రాజీనామా.. కొన్ని కోట్ల రూపాయల కంపెనీకి అధినేత.. ఇదే ఇతని సక్సెస్ స్టోరీ!
సాక్షి ఎడ్యుకేషన్: మనం అనుకున్న లక్ష్యానికి చేరే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు, ఎదురుదెబ్బలు వంటివి ఎదురవుతాయి. అయితే, ఈ సమయంలోనే ప్రతీ ఒక్కరు ధైర్యంగా నిలబడాలి. ఇటువంటి కష్టాలను, ఒటమిని తట్టుకొని నిలబడి, నేడు కొన్ని వేల కోట్లు విలువ చేసే కంపెనీకి అధిపతిగా ఉన్నాడు ఈ యువకుడు. ఈ కథనంలో మనం తెలుసుకొనున్న సక్సెస్ స్టోరీ ఇతనిదే..
ఒకప్పుడు సోమర్‌విల్లే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని అనంతరం, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అతనే అకుష్ సచ్ దేవ్.. అదే కంపెనీలో 2014 మే నుంచి జులై వరకు ఇంటర్న్‌గా కూడా పని చేసాడు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఇలా, తన జీవితం నడుస్తుండగా, చాలామంది యువత నడిచే దారిలోనే తానూ నడవాలనుకొని, తన ఉద్యోగానికి రాజీనామ పలికాడు. అంకుష్‌కు తన సొంతంగా ఏదైనా సాధించాలన్న తపన ఉండేది. ఉద్యోగం చేయడం కాకుండా, ఏదైనా వ్యాపారం చేసి అందులో నెగ్గాలన్న ఆశ ఎక్కువగా నిలిచిపోయింది. దీని వల్ల తన ఉద్యోగానికి రాజీనామ చేశాడు.
17 విఫల ప్రయత్నాలు..
వ్యాపారం ప్రారంభించాడు కాని, అది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అయ్యేది. తను మొదట చేసిన 17 ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి. నిజానికి, ఇటువంటి సందర్భం ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వస్తే తనా 17 ప్రయత్నాల వరకు రాకపోవచ్చు. తన 2 లేదా 3 మరి కొందరు కనీసం వారి పట్టుదలతో 5 లేదా 6 ప్రయత్నాలు చేస్తారు. అన్ని విఫలమైతే, మళ్ళీ ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.
కాని, ఇక్కడ అంకుష్ పూర్తిగా వేరు. ఎందుకంటే, తన 17 విఫల ప్రయత్నాల తరువాత కూడా కృంగిపోయినప్పటికి, తన పట్టుదల, ఆత్మ విశ్వాసం, తన ఆశయం ఏమాత్రం వదులుకోలేదు. ఇలా మరో ప్రయత్నానికి నాంది పలికాడు. చివరికి, ఈ ప్రయత్నం ఫలించింది. ఇలా, ఈ ప్రయత్నంలో తన స్నేహితులను కూడా భాగం చేయడం విశేషం. ఇలా, వీరు ముగ్గురు కలిసి తమ ఆలోచనలను అమలు చేసి ప్రస్తుతం, ఈ యాప్‌ను ఇంతలా విజయవంతం చేశారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
స్నేహితులతో కలిసి..
ఫరీద్ అహ్సన్, భాను సింగ్‌లతో కలిసి షేర్‌చాట్ యాప్‌ను రూపొందించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కొత్తగా ఏదైనా కావాలని కోరుకునే కొంతమంది వినియోగదారుల కోసం వెతికారు. అయితే, జనవరి 2015లో షేర్‌చాట్ మాతృ సంస్థ మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు.
దీని తర్వాత షేర్‌చాట్ అక్టోబర్ 2015లో స్థాపించారు. మొదట్లో ఈ షేర్ చాట్ హిందీ, మరాఠీ, మలయాళం, తెలుగు భాషలలో ప్రారంభం కాగా, నేడు మొత్తం 15 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అంకుష్ వ్యాపారం అమెరికా, యూరప్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది.
ఇలా, తన కృషి, పట్టుదల, తన మిత్రుల తొడుతో గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. తాను చేసిన ప్రతీ ప్రయత్నం బోల్తా కొట్టింది అయినా, తన ప్రయత్నాలు ఆగకపోగా, తన పట్టుదల మరింత పెరిగింది. ఇలాగే, అంకుష్ కథను తెలుసుకున్నవారు కూడా తమ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చిన సరే మన అడుగులు గమ్యం నుంచి మళ్ల కూడదు.
Prof Satish Dhawan Real Life Story : ఇస్రోలో కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకోని...