Sarala Thakral Success Story : మొట్టమొదటి మహిళ పైలెట్.. ఇంకా పారిశ్రామికవేత్తగా సరళా థక్రాల్.. ఇదే తన సక్సెస్ స్టోరీ.. వీరి ప్రోత్సాహంతోనే !
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వందల మంది మహిళలు ఈ రంగంలో తమ గెలుపును వెతుకున్నారు.. విజయవంతులయ్యారు. 1914లో జన్మించిన సరళా చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో ముందుకు వెళ్లలేదేమో అనుకోవద్దు. తన భర్త, మామగారు ఇచ్చిన ప్రోత్సాహమే తన విజయానికి కారణమైంది. భారత దేశ తొలి మహిళ పయిలెట్ సరళ థక్రాల్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Ramchandra Aggarwal Sucess Story: వైకల్యంతో నడవలేని స్థితి, వందల కోట్ల వ్యాపారవేత్తగా విజయం..
మహిళలంతా సంప్రదాయంగా ఉండాలి, ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వీలు లేదు. తమ మనసులో మాటలను కూడా బయటకు చెప్పుకునే స్వేచ్ఛ లేని ఆ కాలంలో పైలెట్ అవ్వాలని కలలు కన్న మహిళ ఆమె. చిన్నతనంలోనే పెళ్లి జరిగినప్పటికి తన భర్తతో చెప్తే తన కలను నెరవేర్చుకోగలను అన్న ఆశ ఒకవైపుంటే మరోవైపు ఇంట్లో అందరు ఏం అనుకుంటారో అన్న భయం, తన భర్త ఎలా స్పందిస్తారో అనే ఆలోచనతో దిగులు చెందుతూనే 'నాకు చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగరాలనే కోరిక ఉంది. ఇప్పుడు అదే ఆశ పెరిగి పైలెట్ అవ్వాలనే ఆశయంగా మారింది..' అని సరళ తన భర్తతో తన ఆశయం గురించి వివరించింది. అదే సమయంలో పక్కనే తన మామగారూ ఉన్నారు. తన కోడలు చెప్పింది విని నువ్వు కూడా పైలెట్ అయితే, మన ఇంట్లో నీతోపాటు 10 మంది పైలెట్లు ఉంటారు అని తన అంగీకారాన్ని తెలిపారు. దీంతో సరళ ఆనందానికి హద్దుల్లేవు.
పైలెట్ ప్రయాణం..
1936 సంవత్సరంలో ఆమెకు ఏవియేషన్ పైలెట్ లైసెన్స్ లభించింది. ఆ సమయంలో జిప్సీ మాత్ విమానాన్ని ఒంటరిగా నడిపి తొలి అడుగులో సాధించింది. ఒక చిన్న రెండు రెక్కల విమానం కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఇకపై ప్రతీ మహిళ తను అనుకున్నది సాధించాలని కోరింది. విమానం నడిపేందుకు పైలెట్‌గా పురుషులే కాదు మహిళలు కూడా అర్హులే అని నిరూపించింది. 16 ఏళ్లకే వివాహం అయిన్నప్పటికీ 21 ఏళ్ల వయసులోనే విమానం నడిపిన తొలి మహిళగా పేరు తెచ్చుకుంది.
పైలెట్ కెరీర్‌కు ముగింపు..!
ఇలా, తన ప్రయాణం తన భర్తతో, తన ఆశయంతో ఎంతో సంతోషంగా సాగుతున్నప్పుడే ఒక విమాన ప్రయాణంలో తన భర్త పీడీ శర్మ మరణించారు. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆమెకు చాలా సమయం పట్టింది. ఎంత బాధ ఉన్నప్పటికీ తన భర్త అనుకున్న లక్ష్యాన్ని తాను చేరాలన్న ఆశ బలంగా నిలిచేసరికి వాణిజ్య పైలట్ కోసం సిద్ధమవడం మొదలుపెట్టింది.
కాని, విధి తనకు వేరే రంగంలో విజయాల్ని రాసిపెట్టింది. తన సిద్ధపడుతున్న సమయంలోనే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం.. పౌర శిక్షణ నిలిపివేయడంతో సరళ తన ఆశయాన్ని అక్కడే ముగింపు పలకాల్సిన పరిస్థితి ఒచ్చింది.
ఒక పైటెట్ మాత్రమే కాకుండా ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా, ఒక పెయింటర్‌గా
తన భర్త ఆశయాన్ని విడిచిన తరువాత సరళ.. లాహోర్‌లోని మేయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి లలిత కళతోపాటు చిత్రలేఖనాన్ని అభ్యసించారు. దీనిని ఇప్పుడు నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తున్నారు. అక్కడ ఇలా కొనసాగుతున్న సరళ, 1947లో జరిగిన దేశ విభజన తరువాత భారత దేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్, పెయింటింగ్ వంటివాటిపై శిక్షణ పొందారు. తను కేవలం ఒక పైటెట్ మాత్రమే కాకుండా ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా, ఒక పెయింటర్‌గా ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. చివరికి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు సంపాదించుకుంది. అలా, తన కుటుంబం సహకారంతో ఎన్నో మెట్లు ఎక్కగలిగింది. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది. తను దేశంలోనే మొదటి మహిళ పైలెట్‌గా గుర్తింపు సాధించడంతోపాటు ప్రతీ మహిళకు ఆదర్శంగా నిలిచింది.
సరళ కేవలం ఒక కూతురు, భార్య, గ్రుహిణి, కోడలు మాత్రమే కాకుండా 4 ఏళ్ల పాపకు తల్లి కూడా. దీంతోపాటు తన విజయవంతమైన పైలెట్.. పారిశ్రామికవేత్త కూడా..