Unemployed Youth Protest at TS Secretariat :సెక్రటేరియట్‌ వద్ద తీవ్ర‌ ఉద్రిక్తత.. గ్రూప్‌-2, డీఎస్సీ వాయిదా వేయాల్సిందే..! లేకుంటే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణలో నిరుద్యోగులు సెక్రటేరియట్‌ ముట్టడితో.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో సోమవారం(జులై 15) సెక్రటేరియట్‌ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను బీఆర్కేభవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా  డీఎస్సీ , గ్రూప్‌-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు.  అంతకుముందు సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ముందస్తుగా నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ముట్టడికి బయలుదేరిన వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోటీ పరీక్షలు వాయిదా వేయాలని రెండు రోజుల నుంచి అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విష‌యం తెల్సిందే. అలాగే మ‌రో వైపు విద్యా రంగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌, స్కాల‌ర్‌షిప్ నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వ‌ర్యంలో సెక్ర‌టేరియ‌ట్ ముట్ట‌డికి పిలుపునిచ్చారు.

☛ TS Government Jobs Updates 2024 : నిరుద్యోగులు ఆందోళన పడొద్దు.. జాబ్‌ కేలండర్ ఇస్తాం.. అలాగే మ‌రో 6000 టీచ‌ర్ పోస్టుల‌కు కూడా నోటిఫికేష‌న్‌ ఇస్తాం ఇలా..

భారీ బందోబ‌స్తు న‌డుమ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. త‌మ‌తో సీఎం మాట్లాడాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

#Tags