Staff Nurse: 6,956 మంది నర్సింగ్‌ ఆఫీసర్లకు నియామక పత్రాలు.. వీరి వేత‌నం ఎంతంటే..!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్టాఫ్‌నర్సు/నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన 6,956 మందికి జ‌న‌వ‌రి 31వ తేదీ (బుధవారం) పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. 2022 డిసెంబర్‌లో 7,094 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఇటీవ‌ల దీనికి సంబందించిన‌ తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. 

ఇందులో మొత్తం 9 విభాగాల్లో 6,956 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు. ఆర్థోపెడికల్‌ చాలెంజ్డ్‌ క్యాటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదని స‌మాచారం. నర్సింగ్‌ ఆఫీసర్లకు కనీస వేతనం రూ.36,750తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. వీరి వేతనాలతో ప్రభుత్వంపై ప్ర‌తి సంవ‌త్స‌రం రూ.35 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో దాదాపు 12 శాతం మంది పురుషులు ఉన్నారు.  

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..
 

#Tags