Telangana Anganwadi centers : రాష్ట్రంలోని 12,315 అంగన్‌వాడీలకు సీఎం గుడ్‌న్యూస్..
మార్చి 2వ తేదీన (శనివారం) సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
☛☛☛ Government Jobs 2024 Notification : ఈ 9 వేల ప్రభుత్వ ఉద్యోగాలను.. ఈ 9 నెలల్లోనే..?
రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్‌వాడీలు..
రాష్ట్రంలో 12,315 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్‌వాడీ భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్‌వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.