Singareni Job Notification: పరీక్షలు తెలుగులో నిర్వహించాలి

గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులతో వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చే సేందుకు చేపట్టే పరీక్షలను తెలుగు మాధ్యమంలో నిర్వహించాలని కార్మికులు కోరారు.

 మార్చి 20న‌ స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో ఏఐ టీయూసీ నాయకులను కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ కృషితో యాజమాన్యం పలు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేసేందు కు నోటిఫికేషన్లు జారీ చేస్తోందన్నారు.

చదవండి: Good News for Singareni Employees: సింగరేణి వర్కర్లకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు

అనంతరం ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లయ్య మాట్లాడుతూ, సంస్థలో చాలామంది సీనియర్‌ కార్మికులు తెలుగు మీడియంలో చదివిన వారు ఉన్నారని, వీరికి ఇంగ్లిష్‌లో పరీక్షలు నిర్వహించడం ద్వారా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరుతామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆరెల్లి పోశం, మిట్ట శంకర్‌, దొంత సాయన్న, బలుసు రవి, ప్రభుదాస్‌, సమ్మయ్య, రమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags