APSRTC Jobs : ఏపీఆర్టీసీలో 5418 ఉద్యోగాలు.. ఇది ఫేక్ నోటిఫికేష‌న్‌.. నమ్మి మోసపోవద్దు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీఆర్టీసీలో 5418 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల‌ను భర్తీ చేస్తురంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
APSRTC

అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC). తాము ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఆర్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసినట్లు  పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో APSRTC వెబ్‌సైట్‌లో డొమైన్‌ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్‌ చేస్తామని స్పష్టం చేసింది. 

ఇలా త‌ప్పుడు ప్ర‌చారం ఎలా ఉందంటే..?

ఇలా త‌ప్పుడు ప్ర‌చారం ఎలా ఉందంటే.. డ్రైవర్ అత్యధికంగా 2740 పోస్టులు ఉన్నాయ‌ని.. అలానే కండక్టర్ 2678 ఉద్యోగాలను భర్తీ చేస్తురంటూ ప్ర‌చారం చేశారు. కండక్టర్ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత 10వ పాస్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 10వ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలంటూ కూడా ప్ర‌చారం చేశారు.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

☛ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
☛ రైల్వే జాబ్స్
☛ మెడికల్ జాబ్స్
☛ బ్యాంక్ జాబ్స్
☛ ఇంజనీరింగ్ జాబ్స్
☛ ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
☛ డిఫెన్స్‌ జాబ్స్

#Tags