Success Story : ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఒక వైపు పేదరికం వెంటాడుతున్నా.. ఆ యువ‌తి మాత్రం చ‌ద‌వులో మాత్రం వెనకడుగు వేయలేదు.

ప్రభుత్వ స్కూల్‌లో చదివి.. స్కాలర్‌షిప్‌లతో ఉన్నత విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత హైద‌రాబాద్‌లోలో హోం ట్యూషన్స్ చెబుతూ.. కోచింగ్ తీసుకోకుండానే 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.

➤☛ Jaya Sucess Story: వ్యవసాయ కుటుంబం​.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ

ఈమే తెలంగాణ‌లోని సూర్యాపేట పాతదొనబండ తండాకు చెందిన భూక్యా మౌనిక .ఈమె రైల్వేలో క్యారేజ్& వ్యాగన్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4లో ఆరో ర్యాంక్, పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈ(AEE) ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ఈ జీవిత‌గాథ ఎంతో మంది నేటి యువ‌త‌కు స్ఫూర్తినిస్తుంది.

➤☛ Thotapalli Jyothi: పట్టుదలతో చదివి.. రెండు ప్రభుత్వ కొలువులు పట్టి

#Tags