Family Success Story : ఈ పేదింటి బిడ్ద‌లు.. చ‌దువును ఆయుధంగా చేసుకున్నారు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

చ‌దువును ఆయుధంగా చేసుకొని.. జీవితంపై పోరాటం చేశారు. అలాగే పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

వీరే తెలంగాణ‌లోని హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్‌. తండ్రి హమాలీ కార్మికుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం.. 

☛ Inspiring Success Story : యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

కుటుంబ నేప‌థ్యం : 
తెలంగాణ‌లోని హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్‌ సంతానం. పెద్ద కుమారుడు రాజ్‌కుమార్‌ అక్కన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్‌ నెల రోజుల క్రితం ఫైర్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కాల్‌ లెటర్‌ రాగానే జూలైలో ఫైర్‌ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

 Motivational Story : మాది నిరుపేద కుటుంబం.. ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

కూలీ పనులు చేస్తూ..
ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. భవిష్యత్‌లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే  కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.

☛ Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

#Tags