DSC 2008: బీఈడీ అభ్యర్థులకు ఊరట.. ఈ పద్ధతిలో భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్‌సీ–2008లో ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థులను ఉమ్మడి జిల్లాలవారీగా కాంట్రాక్టు సర్విసుల్లోకి తీసుకోవాలని తెలంగాణ‌ ప్రభు­త్వం నిర్ణయించింది.

దాదాపు 1,300 మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వులతో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది. డీ.ఎడ్‌ విద్యార్హతగల అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టుల్లో 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2009 జనవరి 29న జారీ చేసిన జీవో–28 కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్‌ను కోరింది.

ఈ మేరకు డీఎస్‌సీ–2008లో ఎఫెక్ట్‌ అయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాలవారీగా సేకరించి జాబితా రూపొందించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్‌ ఫాంలను కూడా రూపొందించి www.rchooedu.tea nfana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటలో ఉంచినట్లు తెలిపారు.

చదవండి: Telugu Grammar for TET/DSC : టెట్‌, డీఎస్సీ పరీక్షల్లో ప్రత్యేకం.. తెలుగు వ్యాకరణంలోని సంధులు..

డీఎస్‌సీ–2008 బీఈడీ అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ నుంచి వెరిఫికేషన్‌ ఫాంలను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నింపడంతోపాటు కాంట్రాక్టు సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డీఈవోకు సమర్పించాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సెప్టెంబ‌ర్ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు ఉమ్మడి జిల్లా డీఈవో వద్ద సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దరఖాస్తులను అనుమతించబోరని స్పష్టం చేశారు.

#Tags