Singareni: 21లోగా ఉద్యోగుల ఖాతాల్లో లాభాల వాటా?
మందమర్రిరూరల్: అక్టోబర్ 21లోగా సింగరేణి కార్మికుల బ్యాంకు ఖాతాల్లో లాభాల వాటా డబ్బులు జమ అవుతాయని సంస్థ ఇన్‌చార్జి సీఎండీ, ఇంధనశాఖ కార్యదర్శి సుశీల్‌శర్మ హామీ ఇచ్చినట్లు ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్ తెలిపారు.
అక్టోబర్ 17న హైదరాబాద్‌లోని కార్యాలయంలో సుశీల్‌శర్మను కలిసి ఎన్నికల కోడ్‌కు సంబంధం లేకుండా ఉద్యోగులకు లాభాల వాటా చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి శనివారంలోగా చెల్లించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
చదవండి:
#Tags