Good News: ‘ఎయిడెడ్ సిబ్బంది’ కోసం ‘న్యూమరరీ’ పోస్టులు
దీని ప్రకారం ప్రభుత్వంలో విలీనమై ఇంకా పోస్టింగ్ లేని 31 మంది లెక్చరర్లు, 23 మంది ప్రిన్సిపాళ్లు, 199 మంది బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని 125 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు తమ ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేశాయి. 895 మంది టీచింగ్ సిబ్బంది, 1120 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనానికి సమ్మతి తెలిపారు. అనంతరం ప్రభుత్వ కాలేజీల్లో సాధారణ బదిలీలకు సర్కార్ ఆమోదం తెలిపింది. తద్వారా ఖాళీ అయిన స్థానాల్లో 864 మంది టీచింగ్ సిబ్బందికి, 921 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మరో 31 మంది టీచింగ్ సిబ్బందిని కొత్తగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నియమించారు. ఇద్దరు అరబిక్ లెక్చరర్లకు సబ్జెక్టు పోస్టులు లేనందున పోస్టింగ్ ఇవ్వలేదు. ఎయిడెడ్ కాలేజీల నుంచి వచ్చిన 23 మంది ప్రిన్సిపాళ్లకు కూడా ఖాళీ లేనందున పోస్టింగులు ఇవ్వలేదు. 31 మంది టీచింగ్, 23 మంది ప్రిన్సిపాళ్లు, 199 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని పోస్టింగులు లేకుండానే డిగ్రీ కాలేజీలకు అటాచ్ చేశారు. వీరు నియమితులైనప్పట్నుంచి ఉన్న కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని, వీరికోసం సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి వాటిలో నియమించడంతో పాటు ఆయా ప్రిన్సిపాళ్లు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం సూచించింది. రెగ్యులర్ ఖాళీలేర్పడ్డాక వీరిని ఆ ఖాళీల్లోకి బదిలీ చేయనున్నారు.
చదవండి:
IIT: కార్పొరేట్‌కు దీటుగా... పేద విద్యార్థులకు ఐఐటీల ఆఫర్…