Ration Dealer Jobs: రేషన్‌ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్‌ను ఆర్డీవో మన్నె ప్రభాకర్‌ జూలై 17న‌ విడుదల చేశారు.

ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి, జాన్కంపల్లి ఖుర్దు రేషన్‌ డీలర్‌కు గాను జనరల్‌ మహిళ, నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల డీలర్‌ జనరల్‌, మాల్తుమ్మెద–2కు మైనార్టీ మహిళ, వదల్పర్తి, జలాల్‌పూర్‌–2 జనరల్‌, తాండూర్‌ మైనార్టీ, లింగంపేట మండలంలోని పొల్కంపేట బీసీ మహిళకు రిజర్వు చేయబడిందన్నారు.

చదవండి: Indian Navy Recruitment: ఇంటర్‌ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం

డీలర్‌ కోసం దరఖాస్తు చేసే వారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, సరియైన అభ్యర్థులు లేని పక్షంలో 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు ఖచ్చితంగా నిరుద్యోగులై ఉండాలని అన్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యుడు, కౌన్సిలర్‌, సోసైటీ డైరెక్టర్‌ పదవిలో ఉన్నవారు అనర్హులన్నారు.

అభ్యర్థులు 16 జులై 2024 నాటికి 18ఏళ్లు పూర్తయి ఉండాలని 40 ఏళ్లకు మించరాదన్నారు. ఆసక్తి గల వారు జూలై 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులను పూరించి ఆర్డీవో కార్యాలయంలో అందించాలని అన్నారు. దరఖాస్తు ఫారాలు తహసిల్దార్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
 

#Tags