ఎంఎన్‌సీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురంటౌన్‌: జెన్‌ ఫ్యాక్ట్‌ బహుళ జాతి కంపెనీ (ఎంఎన్‌సీ)లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌ ఆగ‌స్టు 22న‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కంటెంట్‌ మోడరేషన్‌, కస్టమర్‌ సర్వీస్‌ వాయిస్‌ సపోర్ట్‌ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాలకు 2022, 2023, 2024 సంవత్సరాల్లో బీటెక్‌ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో హెచ్‌ఆర్‌, టెక్నికల్‌ రౌండ్లు ఉంటాయన్నారు.

చదవండి: Cochin Shipyard Recruitments : కొచ్చిన్ షిప్‌యాడ్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఉద్యోగాలు హైదరాబాద్‌ హఫీజ్పేట్‌లో రొటేషన్‌ షిప్టుల్లో అందుబాటులో ఉంటాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఆసక్తి గల యువత హెచ్‌టీటీపీఎస్‌://బిట్‌.ఎల్‌వై/46డబ్ల్యూజెడ్‌క్యూజెడ్‌6 లింక్‌ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, స్థలాన్ని తెలియజేస్తామన్నారు. సమాచారం, సందేహాలకు సెల్‌: 63012 75511, 94947 77553 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

#Tags