గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర గురుకుల అభ్యర్థులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు.

రాఖీ పండుగ సందర్భంగా రేవంతన్నకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మెరిట్‌ ఆధారంగా నియామకాలు జరపాలని విన్నవించారు.

గురుకుల నియామకాల్లో పోస్టులు మిగిలిపోకుండా నెక్ట్స్‌ మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేసేలా ఉండాలన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు.

చదవండి: Collector Deepak Tiwari: నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి

మూడు నెలలుగా గురుకుల అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగ‌స్టు 18న‌ గురుకుల నెక్ట్స్‌ మెరిట్‌ అభ్యర్థులు జి.నాగలక్ష్మి, బి.లలిత, కె.పరమేశ్వరి, శైలజ, రమణి తదిత రులు మాట్లాడుతూ.. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో (9,210 పోస్టు లు) డిసెండింగ్‌ ఆర్డర్‌ పాటించకపోవడం వల్ల, వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి పోస్టుల కేడర్‌ వేరైనప్పటికీ కొన్ని పేపర్లు ఉమ్మడిగా నిర్వహించడం వల్ల చాలా మంది అభ్యర్థులకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

ప్రస్తుతం ఒక ఉద్యోగం కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వాళ్లకు నచ్చినటు వంటి ఒక ఉద్యోగంలోనే చేరారన్నారు. వారు వదిలేసిన లేదా చేరకపోవడం వల్ల సుమారు 2,500 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇలా భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

#Tags