Lecturer Jobs: గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ.. అర్హతలు ఇవే..

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కే.జాన్‌ మిల్టన్‌ సెప్టెంబ‌ర్ 17న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ రెండు అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 20న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

21న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌ల్లో పీజీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు పొందినా సరిపోతుందని వివరించారు.

చదవండి: Guest Lecturers: గెస్ట్‌ లెక్చరర్లను రెన్యూవల్‌ చేయాలి

గిరిజన విద్యార్థికి ఐటీడీఏ ప్రోత్సాహం

భద్రాచలం టౌన్‌: కొత్తగూడెంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల(బాలికలు)లో చదువుతూ ఐఐటీలో ర్యాక్‌ సాధించిన వజ్ర మానసకు ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్‌ మంగళవారం రూ. 50 వేల ప్రోత్సాహకం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానస ఐఐటీ జేఏఎం పీజీ ఫిజిక్స్‌లో 5,042 ర్యాంకు సాధించి, రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో సీటు సాధించినట్లు తెలిపారు. ఐఐటీలో సీట్‌ సంపాదించి తోటి విద్యార్థినిలకు మార్గదర్శకంగా నిలవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో అకౌంటెంట్‌ సంధ్య, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Govt Junior Colleges: గెస్ట్‌ లెక్చరర్లను తొలగించడం సరికాదు

జేఎల్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఖుర్షీద్‌

కొత్తగూడెం అర్బన్‌: జూనియర్‌ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎండి.ఖుర్షీద్‌ అహ్మద్‌ ఎన్నికయ్యారు. మూడేళ్ల పదవీ కాలానికి గాను సెప్టెంబ‌ర్ 17న‌ కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్‌ సెక్రటరీగా నాగేశ్వరరావు, వైస్‌ ప్రెసిడెంట్‌గా అక్తర్‌అలీ, ట్రెజరర్‌గా ఓ.పవన్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీగా శ్రీనివాసరావు, లేడీస్‌ సెక్రటరీగా నీరజ, స్టేట్‌ కౌన్సిలర్‌గా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా శేషుబాబు వ్యవహరించగా, సీనియర్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి పాల్గొన్నారు.

జాతీయస్థాయిలో విద్యార్థి ప్రతిభ

భద్రాచలం టౌన్‌: భద్రాచలంలోని త్రివేణి స్కూల్‌ విద్యార్థిని పారెల్లి భవ్యశ్రీ ఇన్‌స్పైర్‌ మనాక్‌ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో భవ్య శ్రీ రూపొందించిన సీడ్స్‌ షోఇంగ్‌ మిషన్‌ ఎగ్జిబిట్‌ ప్రొఫెసర్ల, సైంటిస్టుల ప్రశంసలు అందుకుంది.

దేశవ్యాప్తంగా 875 సైన్స్‌ ఎగ్జిబిట్లు రాగా, తెలంగాణ నుంచి 24 ఎగ్జిబిట్లు పాల్గొంటున్నాయి. కాగా భవ్యశ్రీతో పాటు గైడ్‌ టీచర్‌ నాగలక్ష్మిని పలువురు అభినందించారు.

#Tags