Lecturer Jobs: గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియంలో ఖాళీగా ఉన్న గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఒకటి చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలని, నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు సెప్టెంబర్ 9లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే 10న డెమో తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు.

చదవండి: Best Teacher Awards: 47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఎంపికైన వారు వీరే..

#Tags