SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ఢిల్లీ పోలీస్‌–సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌ఎస్‌)లో.. సబ్‌–ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) నియామక పరీక్ష–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతోపాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్‌)–బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎస్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 4,187
పోస్టుల వివరాలు: ఢిల్లీలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు(పురుషులు)–125, సబ్‌ –ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు(మహిళలు)–61, సీఏపీఎఫ్‌ఎస్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు–4001.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండా­లి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
వేతనం: రూ.35,400 నుంచి రూ.1,12,400.

ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ)/ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.03.2024
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 09.05.2024, 10.05.2024, 13.05.2024.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

చదవండి: SSC Recruitment 2024: ఎస్‌ఎస్‌సీ-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2049 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags