IT department: నిరుద్యోగ అభ్యర్థులను హెచ్చరించిన ఐటీ శాఖ..

నిరుద్యోగుల ఆశను తమకు అనుకూలంగా మార్చుకొని ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు.
నిరుద్యోగ అభ్యర్థులను హెచ్చరించిన ఐటీ శాఖ..

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిత్యం ఏదో ఒక చోట మోసం బయటపడుతూనే ఉంది. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నిరుద్యోగ అభ్యర్థులను అలర్ట్‌ చేసింది. మోసపూరిత ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దంటూ ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగుల అభ్యర్థుల్లో అవగాహన కలిగించేందుకు ఐటీ శాఖ ఓ ట్వీట్ చేసింది. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఎస్‌ఎస్‌సీ లేదా ఐటీ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే నమ్మాలని తెలిపారు. ఈ వెబ్‌సైట్స్‌లో వచ్చిన నోటిఫికేషన్స్‌కు మాత్రమే నమ్మాలంటూ పేర్కొన్నారు. కొంత మంది మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ లేఖల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి వంటి ఉద్యోగాలన్నింటినీ నేరుగా ఎస్‌ఎస్‌సీ ద్వారానే భర్తీ చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

చదవండి: 

​​​​​​​Sports Quota Recruitment: ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

Pancard : మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!

ఇంటి నుంచి పనిచేసినా...ఇవి చెల్లించాల్సిందే..

#Tags