Job Layoffs: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు!!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.

టెస్లా మే 13వ తేదీ ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 ​​మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.

టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు  ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది.

Employee Layoffs: ఉద్యోగుల‌ను తొలగిస్తూనే ఉన్న ప్రముఖ టెక్ కంపెనీ.. కార‌ణం ఇదే..!

#Tags