Job Fair for Freshers: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

విద్యానగర్‌(కరీంనగర్‌): ఇంటర్‌ చదివిన విద్యార్ధులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జగన్‌మోహన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈనెల 8న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ITI counselling: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

కలెక్టర్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరిగే ఈ జాబ్‌మేళాలో 2023–2024 విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో 75శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. వివరాలకు హెచ్‌సీఎల్‌ ప్రతినిధిని సెల్‌నంబరు 75691 77071లో సంప్రదించాలని సూచించారు

#Tags