Indo-Tibetan Border Police : ఐటీబీపీలో 330 ఉద్యోగాలకు ప్రకటన విడుదల.. నేడే చివరి అవకాశం..!
ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 330 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతితో పాటు ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు కూడా అర్హులే. ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ వివరాలు..
☞ మొత్తం పోస్టులు: 330
☞ పురుషులకు: కానిస్టేబుల్ (కార్పెంటర్)–61, కానిస్టేబుల్(ప్లంబర్)–44, కానిస్టేబుల్(మేసన్) –54, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్)–14, కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ)–8, కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్)–97, కానిస్టేబుల్ (కెన్నెల్ మ్యాన్)–4 ఖాళీలు ఉన్నాయి.
☞ మహిళలకు: కానిస్టేబుల్ (కార్పెంటర్)–10, కానిస్టేబుల్(ప్లంబర్)–8, కానిస్టేబుల్ (మేసన్)–10, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్)–1, కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్)–18, హెడ్‌కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ)–1 ఖాళీలున్నాయి.
అర్హతలు
☞ మెట్రిక్యులేషన్/పదోతరగతితో పాటు ఏడాది వ్యవధి ఉన్న ఐటీఐ(కార్పెంటర్/ప్లంబర్/మేసన్/ఎలక్ట్రీషియన్ ట్రేడ్)సర్టిఫికెట్ కోర్సు ఉండాలి.
☞ హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్ వెటర్నరీ) పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై.. ఏడాది వ్యవధి ఉన్న వెటర్నరీ కోర్సు/డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి.
☞ కానిస్టేబుల్(యానిమల్ ట్రాన్స్‌పోర్ట్), కానిస్టేబుల్ (కెన్నల్‌మ్యాన్) పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయసు
10.09.2024 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుకు 18–25 ఏళ్లు ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నల్ మ్యాన్) పోస్టుకు 18–27 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది.
NEET UG 2024 Counselling: నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. తెలంగాణ, ఏపీకు ఎన్ని సీట్లంటే..
ఎంపిక ప్రక్రియ
☞ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్,రాతపరీక్ష,ట్రేడ్ టెస్ట్,ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
☞ మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, నాలుగో దశలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
☞ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ): పురుషులు 1.6 కి.మీ. రేసును 7.5 నిమిషాల్లో పూర్తిచేయాలి. 11 అడుగుల లాంVŠ జంప్, మూడున్నర అడుగుల హైజంప్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడు అవకాశాలు ఇస్తారు.
మహిళలు
800 మీటర్ల రేస్‌ను 4.45 నిమిషాల్లో పూర్తిచేయాలి. 9 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హైజంప్ లక్ష్య సాధనకు మూడు అవకాశాలు ఇస్తారు. అర్హత సాధించిన వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మాజీ సైనికోద్యోగులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉండదు.
రాత పరీక్ష
ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. జనరల్ ఇంగ్లిష్ 20 ప్రశ్నలకు–20 మార్కులు, జనరల్ హిందీ 20 ప్రశ్నలకు–20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలకు–20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 20 ప్రశ్నలు–20 మార్కులు, సింపుల్ రీజినింగ్ 20ప్రశ్నలు–20 మార్కులు.ఇలా.. మొత్తం 100ప్రశ్నలకు–100 మార్కులుంటాయి. ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలో ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కులు లేవు.
వేర్వేరుగా పరీక్షలు
☞ పోస్టులను అనుసరించి హెడ్‌కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్డ్), కానిస్టేబుల్ (కెన్నల్‌మ్యాన్) పోస్టులకు వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటికి పరీక్ష సమయం రెండు గంటలు.
☞ ఈ పరీక్షల్లో అర్హత సాధించినవారికి కార్పెంటర్, మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో 50 మార్కులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అన్ని కేటగిరీల వారు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. విభాగాల వారీగా మెరిట్ లిస్ట్‌ను తయారు చేసి ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు.
Swachh Vayu Survekshan: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ఫలితాలు.. టాప్‌లో ఉన్న నగరాలు ఇవే..
ప్రిపరేషన్ ఇలా
☞ రోజువారీ టైమ్‌టేబుల్ వేసుకుని పరీ„ý కు ఇప్పటినుంచే సన్నద్ధతను మొదలుపెట్టాలి. బ్యాంకు, రైల్వే, ఎస్‌ఎస్‌సీల పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాల సాధనతో ఫలితం ఉంటుంది. ఏయే అంశాల్లో తక్కువ మార్కులు వస్తున్నాయో తెలుసుకుని.. వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఐటీఐలో చదివిన ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నలే ట్రేడ్ టెస్టులో ఇస్తారు. కాబట్టి ఆయా అంశాలపై పట్టు సాధించాలి. నెగిటివ్ మార్కులు లేవు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, తర్వాత తెలియని వాటినీ ప్రయత్నించొచ్చు.
ముఖ్యసమాచారం
☞ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
☞ దరఖాస్తులకు చివరి తేదీ: 10.09.2024
☞ వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in/rect/index.php
PG Seats Allotment: వర్సిటీల్లో మొదటి విడత పీజీ సీట్ల కేటాయింపు