Bad news for Anganwadis: అంగన్‌వాడీలకు బ్యాడ్‌న్యూస్‌ ఇంకా అందని ఈ ప్రయోజనాలు...

Anganwadi news

నల్లగొండ: ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం పూర్తిస్థాయిలో అందక ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి వారికి జీత భత్యాలు కూడా నిలుపుదల చేసింది.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ డిసెంబర్‌ నెలలో ఏకంగా 10 రోజులు స్కూళ్లకు సెలవులు: Click Here

226 మంది ఉద్యోగ విరమణ పొందితే..

జిల్లాలో 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీలు 226 మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరిలో 58 మంది టీచర్లు, కాగా 168 మంది ఆయాలు ఉన్నారు. వీరిలో టీచర్లకు ఇప్పటి వరకు 43 మందికే లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందింది. వీరికి ఇంకా మరో రూ.లక్ష అందించాల్సి ఉంది. మిగిలిన 15 మందికి అసలు ఆర్థిక సాయమే అందలేదు. కాగా 168 మంది ఆయాలు రిటైర్‌ కాగా అందులో ఒకరికి కూడా ఇప్పటి వరకు రూ.లక్ష సాయం అందించలేదు. దీంతో ఆర్థిక సాయం అందని టీచర్లు, ఆయాలకు ఐదు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

రిటైర్‌ అయిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి టీచర్లకు కొందరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశాం. పెంచిన రూ.లక్ష అందించాల్సి ఉంది. ఆయాలకు కూడా ఇంకా చెల్లింపులు జరగలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – కృష్ణవేణి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ

#Tags